నేనూ వైరా--వేరే వేరే ఐటమ్ సాంగ్ లిరిక్స్

సాకి:-

నాకు నచే మగా...డా!

ఏడనున్నడు జగా...నా!

నా కంటబడిన క్షణా...నా!

నిలువ గలడా...లోకా...నా!

పల్లవి:-

నేనూ వైరా-- వేరే వేరే ||

ఆ...కలి పుత్రిక నేనే  

యుగ దేవత నేనూ

ఆ...నాటి శూర్పణఖ నేనే 

లేరా సురకత్తె నేనూ

అను పల్లవి:-

అరచేతిలో వైకుంఠం చూపిస్తా...స్తా...

అరిటాకులో వైకుంఠఫాలీ ఆడిస్తా...స్తా.

నా లోన లోలోన అమృతమే ఒలికింది 

ఇక స్వర్గాన్నే నేల దించేస్తా......

నేనూ వైరా-- వేరే వేరే ||


చరణం:-

1*కొంచెం కొంచెం చూడొచ్చు-మరి మరి కొంచెం అనవచ్చు 

*ఆడా ఈ డా తాకొచ్చు-నీకు నచ్చిన చోటె కోటెట్టు

*తుఫానులా విరహాలే-నిలువెల్లా ముంచేసి పోనాయి....

*మగాడిలా రావాలే-నలుగెట్టి నాకూ పోవాలే...

*అందం అంతా మంటేస్తా-టీ కాచుకో సారూ..

*వలపంతా వడ్డిస్తా-కళ్ళే మంటకెక్కెలా

*కనురెప్పల్లో నేనుంటా-కనుసన్నల్లో ఒదిగుంటా

*నీటిబిందు నేను-కానా నీకు విందు నేను.

నేనూ వైరా-- వేరే వేరే ||

2*ఓపలేని వయస్సే ఉంది-వాటేసుకోరా వరసే ఉంది

*కాస్సేపు రారా కేఫే ఉంది-కాఫీ నచ్చేనంటే ఓరేటుందీ

*కోటా సరుకే కాను కాను-ఏ కోటికి బెదరను నేను

*నానడుం నాజూకు చూడు-నాతలపే తమలా పాకు రేకు

*టచ్ చేసి చూడునన్నే-లుక్ లైక్ ఫస్ట్ పెగ్ కిక్కే కిక్కే

*ఎడారిలో ఒంటేరా-సేదదీరాలనుకుంటే

*రగిలే నిప్పే నేను-నీలా నీలా నేను లేనూ-

నేనూ వైరా-- వేరే వేరే ||


Comments

Post a Comment